గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవదాసు మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించిన ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ తో మంచి విజయాన్ని అంతకుమించిన క్రేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి అతి తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగిపోయింది.

ఇది ఇలా ఉంటే ఇలియానా ఆఖరుగా తెలుగులో రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ అనే  మూవీ లో నటించింది. ప్రస్తుతం ఇలియానా ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఫోకస్ పెట్టింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఇలియాన కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ తాజాగా వైరల్ గా మారుతుంది. ఇలియానా ప్రస్తుతం ప్రేమలో ఉంది అని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... హీరోయిన్ కత్రీనా కైఫ్‌ సోదరుడు ‘సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌’తో ఇలియానా ప్రస్తుతం లవ్‌ ట్రాక్‌ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలియానా  మరియు సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌  పెళ్లికి రెడీ అయ్యారట. సడన్ గా వీరిద్దరి పెళ్లి వ్యవహారం వైరల్ కావడానికి ఒక కారణం ఉంది. సెబాస్టియన్‌ తో కలిసి ప్రస్తుతం ఇలియానా  పెళ్లి షాపింగ్ ని చేస్తోందట. అందుకే వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక వార్త ప్రచారం జరుగుతుంది.  కానీ, ఈ ప్రచారం పై ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా లేదు. మరి ఇలియానా నిజంగానే సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్ ని పెళ్లి చేసుకుంటుందో ... లేదో ... చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: