‘జ్యోతిలక్ష్మి’ మూవీతో ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సత్యదేవ్ తనకు సినిమాల పై ఉన్న మోజుతో లక్షల జీతాన్ని అందుకుంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకుని సినిమాల వైపు వచ్చాడు. ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ అతడికి చెప్పుకోతగ్గ హిట్ లేదు.  


అతడు హీరోగా నటించిన ‘శీతాకాలం’ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందో అతడికే తెలియని పరిస్థితి. అతడు నటించిన ‘కృష్ణమ్మ’ విడుదల తేదీ కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి పరిస్థితులలో సత్యదేవ్ నటించిన రెండు భారీ సినిమాలు అక్టోబర్ లో విడుదల కాబోతున్నాయి. ‘గాడ్ ఫాదర్’ మూవీలో సత్యదేవ్ నెగటివ్ షేడ్స్ లో చిరంజీవిని ఢీ కొట్టే ఛాలెంజింగ్ రోల్ లో కనిపించబోతున్నాడు.


ఈసినిమాలోని కొన్ని సీన్స్ లో ఏకంగా మెగాస్టార్ నే ఎదిరించే డైలాగులతో సత్యదేవ్ చెలరేగిపోయాడు అని అంటున్నారు. ఈనెలలోనే సత్యదేవ్ అక్షయ్ కుమార్ తో కలిసి నటించిన విజువల్ ఫాంటసీ మూవీ ‘రామసేతు’ అక్టోబర్ 25న రిలీజ్ కానుంది. విజువల్ ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో అయోధ్య రాముడి సెంటిమెంట్ ని టచ్ చేస్తూ యాక్షన్ థ్రిల్లర్ గా ఈమూవీని రూపొందించారు. ఈమూవీలో సత్యదేవ్ అక్షయ్ కుమార్ తో కలిసి ఉండే పాత్ర అంటున్నారు. ‘కార్తికేయ 2’ బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో అదే తరహాలో ‘రామసేతు’ మూవీ కూడ బ్లాక్ బష్టర్ హిట్ అవుతుంది అన్న అంచనాలు ఉన్నాయి.  


ఈ రెండు సినిమాలు అంచనాలకు అనుగుణంగా బ్లాక్ బష్టర్ హిట్ అయితే సత్యదేవ్ కూడ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయే అవకాశం ఉంది. అతడు నటించిన సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడే ఆస్కారం ఉంది అంటూ అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో యంగ్ విలన్స్ కొరత చాల ఎక్కువగా ఉంది. ‘గాడ్ ఫాదర్’ లోని సత్యదేవ్ నెగిటివ్ పాత్ర అందరికీ బాగా నచ్చితే ఇక అతడికి ఎదురుండదు..మరింత సమాచారం తెలుసుకోండి: