కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరిగా కెరియర్ ని కొనసాగిస్తున్న చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చయాన్ విక్రమ్ తన కెరియర్ ప్రారంభంలో తెలుగు లో కూడా కొన్ని మూవీ లలో నటించాడు. ఆ తర్వాత విక్రమ్ తమిళ సినిమా ఇండస్ట్రీ పై ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాడు. అలాగే తమిళ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం చియాన్ విక్రమ్ సక్సెస్ ఫుల్ గా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే  విక్రమ్ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు.

విక్రమ్ తాజాగా కోబ్రా మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ నిధి శెట్టి ,  విక్రమ్ సరసన హీరోయిన్ గా నటించగా , అజయ్ జ్ఞానముత్తు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా  విక్రమ్ "పొన్నియన్ సేల్వన్" అనే మూవీ లో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కి మణిరత్నం దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.

ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే పొన్నియన్ సెల్వన్ మూవీ లో విక్రమ్ తో పాటు కార్తీ , జయం రవి ,  ఐశ్వర్యా రాయ్ ,  త్రిష , శోభిత ధూళిపాల వంటి నటులు నటించారు. ఇలా ఈ సంవత్సరం ఇప్పటికే రెండు మూవీ లతో ప్రేక్షకులను అలరించిన విక్రమ్ మరో మూవీ తో ప్రేక్షకుల ముందుకు ఈ సంవత్సరం రానున్నట్లు తెలుస్తుంది. విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన "దృవ నచింతరం" మూవీ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఈ మూవీ ని కూడా ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: