తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం నటుడు కృష్ణంరాజు, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించడంతో అటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక ఇప్పుడు అదంతా మరవకముందే తాజాగా చిత్ర పరిశ్రమలో తీవ్రమైన విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి చెన్నైలో తన నివాసంలో తుది శ్వాస విడిచడం జరిగింది ప్రస్తుతం ఈయన వయసు 78 సంవత్సరాలు. డైరెక్టర్ కావాలని కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన యువచిత్ర ఆర్ట్స్ పేరుతో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.


ముఖ్యంగా గోరింటాకు, నారి నారి నడుమ మురారి అభిమన్యుడు, జానకి రాముడు తదితర చిత్రాలకు నిర్మించారు. ముఖ్యంగా డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన నిర్మించిన జానకి రాముడు సినిమా ఇటు నాగార్జున విజయశాంతి కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. కాట్రగడ్డ మురారి మృతితో సినీ పరిశ్రమలో పలు విషాద ఛాయలు ఏర్పడ్డాయి. ఈయన మృతి పట్ల సినీ ప్రముఖుల సైతం సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 1944 జూన్ 14న విజయవాడలో ఈయన జన్మించారు.


కాట్రగడ్డ మురారి దర్శకుడు కావాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ఆయన రెండో ప్రయత్నాలు చేసిన కాలేకపోవడంతో నిర్మాతగా తనకే కొనసాగించాలని నిర్ణయాన్ని తీసుకున్నారు నిర్మించిన ఈయనకు కెవి మహదేవన్ సంగీతాన్ని ఈయన సినిమాలకు ఎక్కువగా అందించే వారట. అందుచేతనే ఈయన సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చాయని సమాచారం. 1990 వరకు వరుస పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. ఇక 2021లో నవ్విపోదురు గాక అనే పేరుతో ఆత్మ కథ కూడా రాశారు. ఇక ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈయన మరణానికి గల కారణాలు ఏంటి అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో వరుస మరణాలతో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: