'కేజీయఫ్‌' సిరీస్ తర్వాత కన్నడ చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో ఎంతగానో అలరిస్తున్నాయి. శాండిల్ వుడ్ చిత్రాలపై యావత్‌ భారత్‌ సీనీ ప్రేక్షకులకు చాలా ఆసక్తి అనేది పెరిగింది.అందుకే కన్నడ మేకర్స్‌ కూడా తెలుగు మేకర్స్ లాగానే వరుసగా పాన్‌ ఇండియా స్థాయి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కొన్ని చిత్రాలు మాత్రం కన్నడ ప్రేక్షకుల కోసమే రూపొందిస్తుంటే.. అవి కూడా మిగతా భాషల ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా చిన్న చిత్రాలు కూడా సెన్సేషన్‌ రికార్డులు క్రియేట్‌ చేస్తున్నాయి. చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన తాజా కన్నడ చిత్రం 'కాంతార'.ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది.తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. శనివారం(అక్టోబర్‌ 15)టాలీవుడ్‌లో రిలీజైన ఈ చిత్రం.. ఫస్ట్‌ షో నుంచే అసలు ఊహించని పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. ఎవ్వరిని అడిగినా కూడా సినిమా మైండ్ బ్లోయింగ్ అంటున్నారు.


మొత్తానికి మౌత్ టాక్ అదిరిపోయిందనే చెప్పాలి.దాని ఫలితంగా తొలి రోజు ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఒక్క రోజే రూ.5 కోట్ల గ్రాస్‌ వసూళ్లని రాబట్టినట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి తెలుగులో రూ.2 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.114 కోట్ల షేర్‌ వసూళ్లని రాబట్టి రికార్డుని సృష్టించింది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరాంగదుర్‌ నిర్మించారు.ఇంకా అలాగే ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయగా అక్కడ కూడా మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. మన గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్ కన్నా కూడా కాంతార అక్కడ మంచి వసూళ్ళని సాధిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక చూడాలి కాంతార ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: