కొంతమంది హీరోయిన్ లు సోషల్ మీడియా ద్వారా ఎంతగానో పాపులారిటీని అందుకుంటూ ఉంటారు.  సినిమాలలో వారికి వచ్చే పాపులారెడ్డి కంటే సోషల్ మీడియా ద్వారా వారికి వచ్చే పాపులారిటీనే ఎక్కువ. ఆ విధంగా తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ప్రేక్షకుల మతులను పోగొడుతూ సోషల్ మీడియాలో భారీ సెలబ్రిటీగా మారిపోయింది హీరోయిన్ మాళవిక మోహనన్. తమిళ సినిమా పరిశ్రమలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమె క్రేజ్ పెరగడానికి అవి కొంత మాత్రమే ఉపయోగపడ్డాయి అని చెప్పాలి.

ఆమె తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసే ఫోటోలకు అభిమానులు ఎంతోమంది ఉన్నా రు. ఈ నేపథ్యం లోనే చాలామంది ఆమె తెలుగు సినిమా పరిశ్రమలో సినిమా చేస్తే బాగుంటుంది అని ఆలోచనలు చేశారు కానీ చాలా రోజులుగా ఆమెను ఎవరు కన్సల్ట్ కాకపోవడంతో తెలుగులో ఆమెకు అవకాశం రాలేదని చెప్పాలి. ప్రస్తుతం ఆమెకు తెలుగులో ప్రభాస్ సరసన నటించే అవకాశం రావడం విశేషం. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్సినిమా చేస్తుం డగా ఆ సినిమాలో ఒక హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ నటిస్తుందట.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుంది ఈ సినిమాలో ఆమెతో పాటు నిధి అగ ర్వాల్ కూడా నటిస్తుంది. హారర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే పేరును ఖరారు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమాకు  సంబంధిం చిన ఫోటో షూట్ కూడా జరిగింది. ఆ ఫోటోషూట్ లో ప్రభాస్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ కూడా పాల్గొనడం విశేషం. మరి తెలుగులో విజయ్ దేవరకొండ సరసన చేయవలసిన సిని మా మధ్యలోనే ఆగిపోవడంతో మళ్లీ అవకాశం అందుకోలేకపోయినా ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ తో కలిపి చేస్తున్న ఈ సినిమాతో విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: