బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయిన జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక బాలీవుడ్ మూవీ లలో నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. కొన్ని రోజుల క్రితం జాహ్న కపూర్ "గుడ్ లక్ జెర్రీ" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది.

మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వి కపూర్ మీలి అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కూడా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీ పై బాలీవుడ్ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.  ఇలా వరస బాలీవుడ్ మూవీ లతో ఈ ముద్దుగుమ్మ ఫుల్ జోష్ లో తన కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. అలాగే జాన్వి కపూర్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కూడా మంచి సినిమా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా జాహ్న కపూర్ , తన సోదరి ఖుషి కపూర్ కి సలహాలు ఇవ్వవలసి వస్తే ఆ సలహా ఇస్తాను అని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పు కొచ్చింది. తాజాగా జాహ్న కపూర్ మాట్లాడుతూ ... ఒక వేళ డేటింగ్ చేయవలసి వస్తే నటుడి తో మాత్రం అస్సలు డేటింగ్ చేయకూడదు అని తన సోదరికి చెబుతాను అని జాన్వి కపూర్ తాజాగా పేర్కొంది. తాను మరియు తన సోదరి ఇద్దరు కూడా ఒకే మనస్వతం కలిగిన వారము అని జాన్వి కపూర్ చెప్పు కొచ్చింది. ఇది ఇలా ఉంటే జాన్వి కపూర్ సోదరి ఖుషి కపూర్ "ది ఆర్చిస్" అనే మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: