మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా "పొన్నియిన్ సెల్వన్ 1"  మూవీతో గ్రాండ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో 'కార్తి' . ఇప్పుడు ఆ సినిమా సందడి తగ్గకముందే మరో సినిమా 'సర్ధార్'తో మన ముందుకొచ్చాడు. విశాల్ తో "అభిమన్యుడు" లాంటి థ్రిల్లర్ మూవీని తీసిన పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్ధార్ మూవీ తమిళనాట మంచి హిట్ అందుకుంది. దీన్ని తెలుగులోనూ ఈరోజు రిలీజ్ చేశారు.ట్రైలర్ తోనే అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈరోజు అక్టోబర్ 21న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం.'సర్ధార్' సినిమా డిఫెరెంట్ కాన్సెప్ట్. ఇదో గూఢచారి కథ. సినిమాలో ఆసక్తికర సీక్వెన్స్ తో డైరెక్టర్ నడిపించాడు. ఒక సైనిక రహస్యాల ఫైల్ కోసం రా, సీబీఐ తోపాటు ఒక పోలీస్ వెతకడంలో పడ్డ కష్టాలు.. అందులోని సస్పెన్స్ ను తెరపై చూపించాడు. కొన్ని సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ రసవత్తరంగా సాగితే ఫ్లాష్ బ్యాక్, సెకాండాఫ్ నెమ్మదిస్తుంది. క్లైమాక్స్ లో మళ్లీ ఆసక్తికరంగా మలిచాడు. కొన్ని సాగదీసే సన్నివేశాలు ఉన్నప్పటికీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలు బాగానే ఉన్నాయి.


 డ్రామా, ఎమోషన్ లు బాగా పండాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు సినిమాలు హైలెట్ అని చెప్పొచ్చు. కార్తి తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. నటనలో కార్తి చింపేశాడని చెప్పొచ్చు. గూఢచారిగా దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఈ కథ కనెక్ట్ అయ్యేలానే ఉంది. కార్తి ధైర్యసహసాలు సినిమాలో చక్కగా ఎలివేట్ అయ్యాయి. సాంకేతికంగా వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు బాగానే తీశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక తమిళ ఫ్లేవర్ వల్ల పాటలు తెలుగు జనాలకు కనెక్ట్ కావు.రాశిఖన్నా ఇందులో లాయర్ పాత్రలో ఫర్వాలేదనిపించింది.కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇన్ఫాక్ట్ ఈమెకు పెద్దగా స్కోప్ రాలేదు.మొత్తానికి ఇక కార్తీ సర్ధార్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే గూఢచారి చిత్రంగా చూడొచ్చు అని చెప్పొచ్చు. సినిమా హిట్ అని పక్కాగా చెప్పవచ్చు. కానీ ఒక వారం ఆగితే కానీ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేము. మరి ఈ సినిమాకి వసూళ్లు ఎలా వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: