తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ దర్శకులలో ఒకరు అయినటు వంటి అనుదీప్ కే వి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నవీన్ పోలిశెట్టి హీరోగా ఫారియ అబ్దుల్లా హీరోయిన్ గా తెరకెక్కిన జాతి రత్నాలు మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడుగా అద్భుతమైన క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.  అలా జాతి రత్నాలు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న ఈ దర్శకుడు తాజాగా ప్రిన్స్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ లో తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న శివ కార్తికేయన్ హీరోగా నటించగా ,  ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ అక్టోబర్ 21 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో భాషలో కూడా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ప్రిన్స్ మూవీ కి తమిళ్ మరియు తెలుగు భాషల నుండి అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ప్రిన్స్ మూవీ రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 56 లక్షలు .
సీడెడ్ : 15 లక్షలు .
ఆంధ్ర : 65 లక్షలు .
రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ప్రిన్స్ మూవీ 1.36 కోట్ల షేర్ , 2.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: