అందాల ముద్దుగుమ్మ ఫారియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫరీయా అబ్దుల్లా , నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన జాతి రత్నాలు మూవీ.తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. జాతి రత్నాలు మూవీ లో చిట్టి పాత్రలో నటించిన ఫరియా అబ్దుల్లా తన నటన తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. దానితో జాతి రత్నాలు మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ లభించింది.

జాతి రత్నాలు మూవీ తర్వాత ఫరియా అబ్దుల్లా కు భారీ క్రేజ్ ఉన్న సినిమా అవకాశాలు మాత్రం టాలీవుడ్ లో దక్కలేదు. జాతి రత్నాలు మూవీ తర్వాత ఫరియా అబ్దుల్లా , నాగార్జున హీరోగా తెరకెక్కిన బంగార్రాజు మూవీ లో ఒక ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ ఐటెం సాంగ్ లో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రావణాసుర మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఫరియా అబ్దుల్లా "లైక్ షేర్ అండ్ సబ్స్క్రయిబ్" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ లో సంతోష్ శోభన్ హీరో గా నటించగా , ఈ మూవీ కి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. దాని తో ఈ మూవీ పై సినీ ప్రేమికులు. మంచి అంచనాలు పెట్టుకున్నారు ఇది ఇలా ఉంటే ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే   మరియా అబ్దుల్లా కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు దక్కే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: