అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటికీ కూడా స్టార్ హీరో హోదాని మాత్రం అందుకోలేక పోతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నాగచైతన్య నటించిన సినిమాలు వరుసగా ప్లాపులు అవుతూనే ఉన్నాయి. ప్రతిసారి సక్సెస్ కోసం ఎవరో ఒకరి మీద ఆధారపడవలసి వస్తోంది. నాగచైతన్య కెరియర్ మొదటి నుంచి చూసుకుంటే సక్సెస్ అయిన సినిమాలు అన్ని కూడా కాంబినేషన్ తరహా సినిమాలే మంచి విజయాలను అందుకున్నాయని చెప్పవచ్చు. మనం, మజిలీ , తడాఖా వెంకీ మామ, లవ్ స్టోరీ, 100% లవ్, తదితర చిత్రాలు అన్ని కూడా కాంబినేషన్ ట్రాక్లో సక్సెస్ అయినవే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.



ఇక రీసెంట్గా వచ్చిన థాంక్యూ సినిమా నాగచైతన్య కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఈ విధంగా దిల్ రాజుకు ఏడాది అతిపెద్ద లాస్ అని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు నాగచైతన్య తన తదుపరిచిత్రంపై మళ్లీ నిర్మాతలను గట్టిగానే ఖర్చు పెడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్లు నిర్మాత సుధాకర్ చేకూరి నాగచైతన్య తన 22వ సినిమా అని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు వెంకట ప్రభు తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తూ ఉన్నారు.

సినిమా కోసం ఏకంగా రూ.25 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం. ఇటీవలే అరవిందస్వామిని కూడా తీసుకురావడం జరిగింది కేవలం యాక్షన్ సినిమాల కోసమే రూ. 10 కోట్ల రూపాయల వరకు ఖర్చుపెడుతున్నట్లు వార్తలే వినిపిస్తున్నాయి. గతంలో ఈ నిర్మాత తలకెక్కించిన చిత్రాలలో రామారావు అండ్ డ్యూటీ, దివారియర్ విరాటపర్వం సినిమాలు చాలా నష్టాలను మిగిల్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నిర్మాతలు నాగచైతన్యతో చాలా రిస్క్ చేస్తున్నారని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాగచైతన్యకు భారీ బడ్జెట్ చిత్రాలు సక్సెస్ కాలేదనే టాక్ ఉంది. మరి నాగచైతన్య నిర్మాతల నమ్మకాన్ని నిలబెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: