ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న కమీడియన్ లలో ఒకరు అయినటు వంటి సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు ను తెచ్చుకున్న సుదీర్ , ఆ తర్వాత ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించే ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే సుధీర్ కేవలం టీవీ షో ద్వారా మాత్రమే కాకుండా అనేక సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా సుదీర్ టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే , సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా సుడిగాలి సుదీర్ "గాలోడు" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , ఈ మూవీ ని సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఈయనే స్వయంగా నిర్మించాడు. గెహనా సిప్పి ఈ మూవీ లో సుడిగాలి సుదీర్ సరసన హీరోయిన్ గా నటించగా ,  భీమ్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని రేపు అనగా నవంబర్ 18 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 2.75 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కనుక ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లు అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: