తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న వరిసు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. రష్మిక మందన ఈ మూవీ లో తలపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిటీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ఇప్పటి వరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన విడుదల చేయడానికి మూవీ యూనిట్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని వారసుడు పేరుతో తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత తలపతి విజయ్ , లోకేష్ కనకరాజు దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో హీరో గా నటించిన బోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతుంది. ఈ మూవీ తలపతి విజయ్ కెరియర్ లో 67 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ పూజా కార్యక్రమం రేపు గ్రాండ్ గా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో మాస్టర్ మూవీ తెరకెక్కింది. మాస్టర్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: