లోక నాయకుడు కమల్ హాసన్ నటించే పాత్రలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల విక్రం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న కమలహాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో స్వాతంత్ర సమరయోధుడి పాత్రలో కనిపించనున్నాడు. శంకర్ మరియు కమలహాసన్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఇండియన్ 2 కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కమలహాసన్ ఆయన నటించే పాత్రలపట్ల ఎలాంటి రెడికేషన్ చూపిస్తాడో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇండియన్ 2 సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

అయితే ఈ సినిమా కథనుగుణంగా కమలహాసన్ పాత్రకు ప్రోత్సటిక్ మేకప్ అవసరమట. ఈ మేకప్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసేందుకు కమలహాసన్ ఆహారం తినడం మానేసి ఎక్కువగా జ్యూస్లని తాగేవారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కమలహాసన్ ఏదైనా నమిలితే ప్రోస్త్రటిక్ మేకప్ సులభంగా రాలిపోయే అవకాశాలు ఉంటాయట. దాంతో ఆకలిని ఓర్చుకుంటూ కేవలం పండ్ల రసాల మీదే షూటింగ్ లో పాల్గొన్నాడట కమల్ హాసన్. దీంతో కమలహాసన్ ఎంత డెడికేషన్ ఉన్న నటుడో ఇది చూస్తేనే అర్థమవుతుంది. శంకర్ మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్సి15 కూడా షూట్ చేస్తున్నారు.

ఇక ఈ స్టార్ డైరెక్టర్ ఓవైపు ఇండియన్ టు సినిమా మరోవైపు ఆర్ సి 15 సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ షూటింగ్లను కొనసాగిస్తున్నాడు. ఇక ఇండియన్ 2 లో కాజల్ అగర్వాల్ ,రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా, భవాని శంకర్ బాబి సింహ, సిద్ధార్థ్ ,సముద్రతని, వెన్నెల కిషోర్ కొన్ని కీలక పాత్రలలో నటిస్తున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఇప్పటికీ విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు మరింత ఆసక్తిని పెంచేశాయి. దీంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామని కమలహాసన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: