మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి త్రిష గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . త్రిష ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో ఎంతో మంది స్టార్ హీరో ల సరసన హీరోయిన్ గా నటించి తన అంద చందా లతో , నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుని ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది . ఇది ఇలా ఉంటే త్రిష తెలుగు తో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎన్నో క్రేజీ మూవీ లలో హీరోయిన్ గా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా టాప్ హీరోయిన్ గా ఎన్నో సంవత్సరా ల పాటు కొనసాగింది . ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ కు కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి .

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వన్ లో కూడా త్రిష నటించిం ది. ఇది ఇలా ఉంటే తాజాగా త్రిష "రంగి" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని "ఓ టి టి" విడుదల చేయడానికి ఏర్పాటులు జరిగినట్లు కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ని డిసెంబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు మురగదాస్ కథను అందించగా , శరవనన్మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: