మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటువంటి నయన తార గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ లో నయన తార చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నయన తార ఎక్కువ శాతం తమిళ మూవీ లలో నటిస్తూ వస్తుంది.

తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా నయన తార ఎక్కువ శాతం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ మూవీ లలో ఎక్కువగా నటిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక లేడీ ఓరియంటెడ్ మూవీ ల ద్వారా నయన తార అద్భుతమైన విజయాలను అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా నయన తార కనెక్ట్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ఈ రోజు అనగా డిసెంబర్ 22 వ తేదీన తమిళ్ మరియు తెలుగు భాషలలో విడుదల కానుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా లేడీ సూపర్ స్టార్ నయన తార యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ సెట్ లో చాలా అల్లరి చేస్తాడు. అలాగే నాపై కూడా జోక్స్ వేసేవాడు. ఒకసారి నేను రెడీ అవుతున్న సమయంలో ఎన్టీఆర్ నన్ను చూస్తూ ఉన్నాడు. ఏమిటి అని అడగ్గా ...  స్క్రీన్ పై నేను ఉన్నప్పుడు అందరు నన్నే చూస్తారు కదా ఇక నువ్వు రెడీ అవ్వాల్సిన అవసరం ఏముంది అని జూనియర్ ఎన్టీఆర్ జోక్స్ వేశాడు అని నాయన తార చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే గతంలో వీళ్ళిద్దరూ అదుర్స్ మూవీ లో కలిసి నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: