ముంబైలో పుట్టి పెరిగి అక్కడే మోడలింగ్ నేర్చుకుంటూ తమిళ్ సినిమా అయిన మూగమూడి లో హీరోయిన్ గా నటించిన అనంతరం తెలుగులో ముకుంద  సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది పూజ హెగ్డే. ఆ సినిమాలో నటించినప్పటికీ దాని అనంతరం సినిమా అవకాశాలు ఆమెకి పెద్దగా రాలేదు. ఇక తెలుగు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించి అక్కడ హీరోయిన్గా మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. దాని అనంతరం అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే సినిమాలో నటించిన ఈమెకి ఆ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. 

దాని అనంతరం స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమా అనంతరం ఈమె హీరోయిన్గా నటించిన అరవింద సమేత మహర్షి వంటి సినిమాలతో మరికొన్ని హిట్లను ఈమె ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు బాగున్నప్పటికీ 2022 మాత్రం పూజ హెగ్డే కి కలిసి రాలేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల ప్రభాస్ మరియు పూజా హెగ్డే జంటగా నటించిన రాదేశామ్మ సినిమా ఎంతటి డిజాస్టర్ ను అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక దాని తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో

 ఈమె నటించినప్పటికీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. తెలుగులోనే కాకుండా  విడుదల  కానున్న బీస్ట్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీన్ని బట్టి చూస్తే పూజ హెగ్డే కి ఒక సంవత్సరంలోనే మూడు డిజాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే తాజాగా ఈమె హిందీలో నటించిన సర్కస్ అనే సినిమా విడుదలై భారీ డిజాస్టర్ గా నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఈ సినిమాతో కలిపి నాలుగు డిజాస్టర్ లను పూజా హెగ్డే ఈ సంవత్సరం అందుకుంది. మొదటగా పూజ హెగ్డేని అందరూ ఐరన్ లగ్ అని అంటుండేవారు. అయితే ఇప్పుడు ఈ నాలుగు సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో ఇప్పుడు నిజంగానే పూజా హెగ్డేది ఐరన్ లెగ్ అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: