సాధారణంగా పలు ఉత్పత్తి కంపెనీలు తమ ఉత్పత్తులను డిస్ట్రిబ్యూట్ చేయడానికి పాపులారిటీ చేసుకుంటూ ఉంటారు. ఆ పాపులారిటీలో భాగంగా స్టార్ హీరో హీరోయిన్ల చేత ప్రకటనలు ఇప్పిస్తూ.. మరింత పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని మహేష్ బాబు, అల్లు అర్జున్ లను మొదలుకొని యంగ్ హీరోయిన్ లు అయిన రష్మిక మందన్న , కీర్తి సురేష్, కృతి శెట్టి , శ్రీ లీలా వంటి హీరోయిన్లు సైతం పలు బ్రాండ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టారు.

ఈ క్రమంలోని 2018లో రిలయన్స్ ట్రెండ్స్ దుస్తుల బ్రాండ్ అంబాసిడర్ గా కీర్తి సురేష్ వ్యవహరించగా.. ఆ తర్వాత జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ నటులు కూడా రిలయన్స్ ట్రెండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు రిలయన్స్ ట్రెండ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా రష్మిక మందన్న సంతకం చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు కానీ ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.

ప్రస్తుతం రష్మిక మందన్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది. మరొకవైపు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా వరిసు సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మరొక పక్క పుష్ప 2 సినిమాలో కూడా ఈమె నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా ఇప్పుడు ప్రారంభించలేదు. ఇకపోతే డీ గ్లామరస్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న రష్మిక మందన్న.. మరొకవైపు గ్లామరస్ పాత్రలు చేస్తూ మరింతగా యువతకు దగ్గరవుతోంది. ఇప్పుడు రిలయన్స్ ట్రెండ్స్ బ్యాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టింది. ఏది ఏమైనా అటు సినిమాలు.. ఇటు వాణిజ్య ప్రకటనల ద్వారా బాగానే సంపాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: