గత కొద్ది రోజులుగా నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న కర్ణాటకలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఆమెను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని వార్తలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. కానీ ఆమెకున్న క్రేజ్ ను బట్టి ఈ నిర్ణయాన్ని నిర్మాతలు తీసుకోలేకపోయారు . అయినా కూడా అక్కడి ప్రజలు ఈమె ప్రవర్తన పై కోపంగా వున్న విషయం తెలిసిందే. ఇకపోతే రష్మిక నటించిన ఏ సినిమాని కూడా కర్ణాటక థియేటర్లలో విడుదల చేయబోమని కూడా హెచ్చరించారు. కానీ కొద్ది రోజుల తర్వాత సమస్యలన్నీ సద్దుమణిగాయి.

ఈ క్రమంలోనే వివాదాల తర్వాత మొదటిసారి కర్ణాటకలో తాను నటించిన వారసుడు సినిమా ప్రమోషన్స్ కోసం బయలుదేరింది రష్మిక. మరి అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలియాల్సి ఉంది.  ఇకపోతే విజయ్ దళపతి హీరోగా,  రష్మిక మందన్న హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ చిత్రం వారసుడు.  ఇదే చిత్రాన్ని తమిళ్లో వారిసు పేరిట రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల వద్ద విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ట్రైలర్ ను రిలీజ్ చేయగా..ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.


ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా నటిస్తున్నట్లు సమాచారం.  ఇకపోతే జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా విషయంలో ఎన్నో వివాదాలు చుట్టుమట్టాయి.  తెలుగు సినిమాలు అయిన  వీర సింహారెడ్డి,  వాల్తేరు వీరయ్య చిత్రాలు కూడా విడుదలవుతున్న నేపద్యంలో ఈ రెండు సినిమాలకు ఎక్కువ థియేటర్లు ఇవ్వకుండా తమిళ హీరోకి తెలుగులో ఎక్కువ థియేటర్ లు ఇవ్వడంతో సర్వత్రా వివాదాలకు దారితీస్తోంది.  మరి ఎక్కువ థియేటర్లను సొంతం చేసుకున్న వారసుడు ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: