టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా కొనసాగుతున్న చిరు.. యువ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు. వాళ్లందరూ కూడా మనకు సుపరిచితులే. అయితే మెగా ఫ్యామిలీలో ఓ సీనియర్ నటుడు గురించి చాలామందికి తెలియదు. ముఖ్యంగా తెలుగు సీరియల్స్ లో ఆయన విలన్ గా నటించి బాగా పాపులారిటీ సంపాదించాడు. సినిమాల్లో కూడా అడపాదడపా క్యారెక్టర్స్ చేసినా.. ఎక్కువగా సీరియల్స్ తోనే ఫేమస్ అయ్యాడు. ఆ నటుడు పేరే హరి. ఈయన మెగాస్టార్ చిరంజీవికి వరసకు బాబాయి అవుతాడు.

ఇక ఈ సీనియర్ నటుడు వయసులో మెగాస్టార్ కంటే చిన్నవాడే అయినా చిరంజీవికి బాబాయి వరస అవుతాడు. నెల్లూరులో టీచర్ ఉద్యోగం చేసే హరి మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహం వల్లే సినీ ఇండస్ట్రీకి వచ్చాడు. అయితే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ఇతనికి చాలా సమయం పట్టింది. ఇక హరి సినిమాల్లోకి రావాలని అనుకోగానే ముందుగా మెగాస్టార్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పాడట. దానికి మెగాస్టార్ నా వంతు సాయం నేను చేస్తా.. కానీ నన్ను మాత్రమే నమ్ముకొని సినీ రంగానికి రావద్దని చెప్పాడట. ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత చిరంజీవి హరికి చిన్న చిన్న వేషాలను ఇప్పించారట.

ఆ తర్వాత 80 లో వచ్చిన చాలా సినిమాల్లో హరి విలన్ గా నటించాడు. కానీ ఆ సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడంతో అతను సక్సెస్ కాలేకపోయాడు. దాంతో టీవీ సీరియల్స్ వైపు దృష్టి పెట్టాడు. సీరియల్స్ లో విలన్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక అలా విలన్ గా గుర్తింపు రావడంతో మళ్లీ రాఖి, సింహాద్రి, మగధీర వంట సినిమాల్లో నటించాడు. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా తాను నటించే ప్రతి సీరియల్ లో హరికి మంచి క్యారెక్టర్ ఇస్తూ ప్రోత్సహించేవారట. అయితే చాలామందికి సీరియల్ నటుడు హరి మెగాస్టార్ చిరంజీవికి బాబాయ్ అవుతాడు అనే విషయం తెలీదు. ఇక ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్ లోను సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: