సినిమా నటుల కెరియర్ కాస్త వింతగా విచిత్రంగా ఉంటుంది. అప్పటివరకు ఎన్ని సినిమాలు చేసిన అవకాశాలకు నోచుకోరు. కానీ ఒక్క సినిమాలో పాత్ర హిట్ అయింది అంటే చాలు వరుస అవకాశాలు క్యూ కడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు సునీల్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది అని చెప్పాలి. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న సునీల్ తర్వాత హీరోగా అవతారం ఎత్తి కొన్ని సినిమాలతో హిట్టు కొట్టాడు. కానీ హీరోగా అదే జోరును కొనసాగించలేకపోయాడు.


 దీంతో మళ్లీ కమీడియన్గా అవుతారమెత్తి ఇక ఇప్పుడు విభినమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో మంగళం శీను అనే ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించాడు సునీల్. డిఫరెంట్ గెటప్ లో ప్రేక్షకులను ఆకర్షించాడు. అతని డైలాగ్ డెలివరీ కూడా సూపర్ అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇక పుష్ప సినిమాలో నటించిన పాత్ర కారణంగా ఇక ఎప్పుడు తమిళ్లో ఫుల్ బిజీ అయిపోయాడు సునీల్. ఇప్పటికే రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు సునీల్.


 సునీల్ డిఫరెంట్ గెటప్ లో ఉన్న ఒక పోస్టర్ను ఇటీవల చిత్రం బృందం విడుదల చేసింది. ఇక తమిళం లో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న మావిరన్, కార్తీ హీరోగా నటిస్తున్న జపాన్ సినిమాల్లో కూడా సునీల్ నటిస్తున్నాడు అని చెప్పాలి. ఒకవేళ సునీల్ నటించిన ఈ సినిమా లు మంచి విజయం సాధించి అతని పాత్రకు గుర్తింపు దక్కింది అంటే అక్కడ మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇకపోతే ప్రస్తుతం అయితే క్షణం తీరిక లేకుండా తెలుగు తమిళ సినిమాల్లో ఫుల్ బిజీగా మారి పోయాడు సునీల్.

మరింత సమాచారం తెలుసుకోండి: