తెలుగు ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న దివి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహర్షి మూవీలో చిన్న పాత్రలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక దివి కి ఎన్నో సినిమాలలో మరియు వెబ్ సిరీస్ లలో అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు మరియు వెబ్ సిరీస్  లు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను కూడా తెచ్చుకున్నాయి. దానితో ప్రస్తుతం దివి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. కొంతకాలం క్రితమే దివి , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్ ఫాదర్ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , అలాగే దివి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించడంతో ఈ మూవీ ద్వారా దివి కి మంచి గుర్తింపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లభించింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని , ఎల్లో కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో దివి పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: