ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యువ హీరోల్లో చూసుకుంటే తక్కువ సమయంలోనే భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక తెలుగు ఇండస్ట్రీలో రౌడీ హీరో అని ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక విజయ్ దేవరకొండకు అటు యూత్ లో ఉండే క్రేజ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఉంటే యూత్ అందరూ కూడా పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు.


 ఇక హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ నటించిన అన్ని సినిమాలకు కూడా మంచి ఓపెనింగ్స్ లభిస్తూ ఉంటాయి అని చెప్పాలి. లైగర్ అనే భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన.. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఇక ఈ సినిమా ప్లాప్ తో విజయ్ దేవరకొండ కెరియర్ ముగిసిపోయినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ అతని మార్కెట్ మాత్రం అటు ఇండస్ట్రీలో ఎక్కడ చెక్కుచెదరలేదు అన్నది తెలుస్తుంది. ఇక ప్రస్తుతం లైగర్ ఫ్లాప్ తర్వాత సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తూ ఉన్నాడు. విజయ్ దేవరకొండ.


 ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ ఏకంగా 90 కోట్ల వరకు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇక ఎప్పుడు విజయ్ దేవరకొండ తీసుకున్నా  పారితోషకం కూడా హార్ట్  టాపిక్ గా మారిపోయింది. ఏకంగా 45 కోట్లు డిమాండ్ చేయగా అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు కూడా నిర్మాతలు వెనకాడ లేదట. అయితే ఈ సినిమా తర్వాత జెర్సీ డైరెక్టర్ గౌతం తిననూరితో ఒక సినిమా చేయబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా కోసం 45 కోట్లు తీసుకుంటున్నాడు విజయ్. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చరణ్, తారక్, బన్నీ కూడా ఇదే రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన విజయ్ దేవరకొండ సైతం భారీ బ్యాగ్రౌండ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: