మెగాస్టార్ చిరంజీవి ఆఖరుగా నటించిన 5 మూవీలు మొదటివారం ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

వాల్తేరు వీరయ్య : చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ మొదటి వారం బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా 96.46 కోట్ల షేర్ , 165.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా , బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ నిర్మించిన ఈ మూవీలో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

గాడ్ ఫాదర్ : చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మొదటివారం బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 53.10 కోట్ల షేర్ , 96.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఆచార్య : చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి వారం బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి వరల్డ్ వైడ్ గా 47.87 కోట్ల షేర్ , 75.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీలో రామ్ చరణ్ హీరోగా నటించిన , పూజా హెగ్డే , రామ్ చరణ్ కు జోడిగా నటించింది.

సైరా నరసింహారెడ్డి : చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో నయనతార , తమన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ మొదటి వారం బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 115.38 కోట్ల షేర్ , 188.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఖైదీ నెంబర్ 150 : చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటివారం బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా 77.32 కోట్ల షేర్ , 111.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: