పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక అలాంటి స్టార్ హీరో తన సినీ కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలను మిస్ చేసుకున్నాడు. దీంతో తమ అభిమాన హీరో మంచి మంచి సినిమాలు వదులుకున్నాడు అని పవర్ స్టార్ అభిమానులు బాధపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఆ సినిమాలన్నింటినీ కూడా పవర్ స్టార్ చేసి ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉంటారు తమ అభిమానులు. ఇడియట్ ,అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, గోలీమార్, నువ్వే కావాలి,  విక్రమార్కుడు, యువ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి.

ఇలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఇక అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వదులుకున్న సినిమాలని వేరే హీరోలు చేసి స్టార్ హీరోలుగా ఎదిగారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో అద్భుతమైన సినిమాని మిస్ చేసుకున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత సెట్ చేసుకున్న లైన్లో సురేందర్ రెడ్డి తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు పవర్ స్టార్ అభిమానులు. అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని తిరగరాస్తుంది అని భావిస్తున్నారు.

కాగా ఈ సినిమాకి నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆప్త మిత్రుడైన రామ్ తల్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వదిలేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఈ సినిమా చేయట్లేదని నా కోసం ఎదురు చూస్తే మీ సమయం వృధా అవుతుంది అని.. అంతేకాదు మీకు నచ్చితే ఈ సినిమాని అన్నయ్య చిరంజీవితో చేసుకోండి అని.. అన్నయ్యకి ఈ స్టోరీ బాగా సెట్ అవుతుంది అని..పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చాడట. ఈ మధ్యనే చిరంజీవితో కలిసి స్టోరీ కూడా వినిపించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చిరంజీవి. దాంతో ఈ ప్రాజెక్టు ఇప్పుడు చిరంజీవి చేస్తున్నాడని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: