నందమూరి బాలకృష్ణ ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయిన వీర సింహా రెడ్డి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో హనీ రోజ్ ఒక కీలకమైన పాత్రలో నటించగా , దునియా విజయ్ , వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో హనీ రోజ్ అద్భుతమైన గుర్తింపు గల పాత్రలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇప్పటికే వీర సింహా రెడ్డి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన రేంజ్ కలెక్షన్ లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే అఖండ ... వీర సింహా రెడ్డి మూవీ ల విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతుంది. దానితో ఈ  చిత్ర బృందం ఇప్పటివరకు ఈ మూవీ కి టైటిల్ ను పెట్టకపోవడంతో ఈ సినిమా షూటింగ్ ను ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో జరుపుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ లో బాలకృష్ణ సరసన హనీ రోస్ హీరోయిన్ గా నటించబోయే అవకాశం ఉందంటూ ఒక వార్త వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: