గతంలో టాప్ హీరోలతో వరసపెట్టి సినిమాలు తీసిన వివి వినాయక్ హవా కొనసాగే రోజులలో అతడు దాసరి నారాయణరావు కె. రాఘవేంద్రరావు ల స్థాయిలో ఇండస్ట్రీలో ఒక ప్రముఖ స్థానంలో వినాయక్ నిలబడతాడు అని చాలామంది భావించారు. దీనికి తగ్గట్టుగానే చిరంజీవి కూడ వినాయక్ ను అవకాశం వచ్చినప్పుడల్లా ప్రోత్సహిస్తూ అతడి పై తన అభిమానాన్ని కొనసాగిస్తున్నాడు.


రాజకీయాల నుండి చిరంజీవి తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకున్నప్పుడు ఎందరో దర్శకులు చిరంజీవితో సినిమా తీయాలని ప్రయత్నించినప్పటికీ మెగాస్టార్ మాత్రం వినాయక్ నే నమ్ముకున్నాడు. చిరంజీవి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ‘ఖైదీ నెంబర్ 150’ మూవీని తీసి చిరంజీవిలో మాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని మరొకసారి రుజువు చేసాడు. ఆమూవీ సూపర్ హిట్ అయినప్పటికీ వినాయక్ కు టాప్ హీరోలు నుంచి అవకాశాలు రాలేదు.


దీనితో ఏమిచేయలేక మెగా కాంపౌండ్ కు చెందిన సాయి ధరమ్ తేజ్ తో సినిమా తీసినప్పటికీ ఆసినిమా భయంకరమైన ఫ్లాప్ గా మారింది. ఆతరువాత వినాయక్ తన లుక్ ను మార్చుకుని తానే హీరోగా మారాలని ప్రయత్నించినప్పటికీ ఆసినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభాస్ రాజమౌళిల బ్లాక్ బష్టర్ మూవీ ‘విక్రమార్కుడు’ మూవీని హిందీలో బెల్లంకొండ శ్రీను తో తీస్తున్నప్పటికీ రకరకాల సమస్యలతో ఆసినిమా ముందుకు సాగడంలేదు అని అంటారు.


ఇలాంటి పరిస్థితులలో కన్ఫ్యూజన్ లో ఉన్న వినాయక్ కు చిరంజీవి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి అతడి కెరియర్ కు లిఫ్ట్ ఇచ్చే ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. ‘వాల్తేర్ వీరయ్య’ మూవీ ఘనవిజయంతో రెట్టించిన ఉత్సాహంతో చిరంజీవి మరో రెండు భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ చిరంజీవితో త్వరలో ప్రారంభించే ఒక భారీ మూవీకి సరైన కథను సిద్ధం చేయమని చిరంజీవి వినాయక్ ను పిలిపించుకుని చెప్పినట్లు తెలుస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: