టాలీవుడ్ లెజెండరి డైరెక్టర్ కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు చనిపోవడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విశ్వనాథ్ గారు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి దొరికిని ఆణిముత్యం. ఇక ఆయన మరణ వార్త తెలియగానే టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా షాక్ కి గురైంది. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుంది. మన ఇండస్ట్రీ నిజంగా ఓ పెద్ద దిక్కును కోల్పోయిందని సినీ అభిమానులు ఎంతగానో బాధ పడుతున్నారు. ఆయన ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతోంది తెలుగు సినీ పరిశ్రమ.ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. పలువురు ప్రముఖులు కె విశ్వనాథ్ గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని బాధ పడుతున్నారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.తెలుగు సినిమా పరిశ్రమని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాధ్ గారు.


తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఆణిముత్యాలు లాంటి సినిమాలు విశ్వనాధ్ గారు తీశారు.సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, స్వయం కృషి, ఆపద్బాంధవుడు ఇంకా శంకరాభరణం వంటి క్లాసిక్ సినిమాలు ఆయన అందించినవే. సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2016 వ సంవత్సరంలో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు లభించింది.1992 వ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డు, అదే ఏడాది పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. స్వాతిముత్యం సినిమా 59వ ఆస్కార్ అవార్డుల బరిలో కూడా నిలిచింది. ఆసియా ఫసిఫిక్ చలనచిత్ర వేడుకల్లో స్వయం కృషి, సాగరసంగమం ఇంకా సిరివెన్నెల సినిమాలను ప్రదర్శించారు.అలాగే మాస్కోలో జరిగిన చలనచిత్ర వేడుకల్లో అయితే స్వయంకృషి సినిమాను ప్రదర్శించారు. ఇంకా అలాగే స్వరాభిషేకం సినిమాకు కూడా ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం లభించింది. అలాగే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం విశ్వనాథ్‌ను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: