

ఇదిలా ఉండగా తారలకు సంబంధించిన ఫొటోస్ పై నెటిజన్లు స్పెషల్ గా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గతంలో స్టార్ హీరోల సరసన నటించి కనుమరుగైన హీరోయిన్స్ గురించి కూడా నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత కీర్తి చావ్లా కూడా తలుక్కుమని మెరిసింది. వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో హీరోయిన్గా నటించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ . అలా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది కీర్తి చావ్లా.

ఈ సినిమా ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న ఈమెకు చాలా స్టార్ డం రావాలి. కానీ కీర్తి చావ్లాకి మాత్రం అది జరగలేదు తెలుగులో కేవలం ఏడు చిత్రాలలోనే నటించిన ఈమె కొన్నింటిలో హీరోయిన్గా చేయగా మరికొన్నింటిలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలలో కనిపించింది. ఆది మూవీ తర్వాత జెడి చక్రవర్తి హీరోగా వచ్చిన కాశీ సినిమాలో కూడా కీర్తి చావ్లా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.. ఆ తర్వాత ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ , సాధ్యం వంటి చిత్రాలతో పాటు మరికొన్ని తమిళ్, హిందీ, కన్నడ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. అసలు ఈమె నటించిన కొన్ని చిత్రాలు అయితే రిలీజ్ కి కూడా నోచుకోలేదు. ఆ తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరం అయింది. దాదాపు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఈమెను చూసేసరికి అంతా షాక్ అవుతూనే తెగ లైక్స్, కామెంట్లు చేస్తున్నారు.