‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బష్టర్ తీసిన తరువాత హరీష్ శంకర్ చాల బిజీ దర్శకుడుగా మారిపోతాడు అని చాలామంది భావించారు. ఆతరువాత అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి భారీ సినిమాను హరీష్ శంకర్ తీసినప్పటికీ ఆతఃరువాత వచ్చిన పరిణామాలు అతడి కెరియర్ కు పెద్దగా సహకరించలేదు. గత కొంతకాలంగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ మూవీని మొదలుపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.


ఈసినిమా ప్రారంభోత్సవం అధికారికంగా జరిగినప్పటికీ ఈమూవీ ఎప్పటికి మొదలై ఎప్పటికి విడుదల అవుతుందో హరీష్ శంకర్ కు కూడ తెలియని పరిస్థితి. ఈపరిస్థితుల మధ్య అయోమయంలో ఉన్న హరీష్ శంకర్ లేటెస్ట్ గా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ వెనుక అర్థాలు ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో అనేక చర్చలు జరుగుతున్నాయి.


అల్లు కాంపౌండ్ కు చాల సన్నిహితుడైన పరుశు రామ్ ఈమధ్య దిల్ రాజ్ నిర్మాణ సంస్థలో విజయ్ దేవరకొండను హీరోగా చేసి ఒక సినిమాను తీస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన వెంటనే అల్లు అరవింద్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆతరువాత కొన్ని గంటలకు ఆ మీడియా సమావేశాన్ని క్యాన్సిల్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈవిషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.


ఇండస్ట్రీలో చాలామంది బడా నిర్మాతలు ఉన్నారని వారంతా డబ్బును పెట్టుబడి పెట్టి భారీ సినిమాలు తీస్తారు కాని అల్లు అరవింద్ లాగా సినిమా మేకింగ్ పట్ల ప్రాణం పెట్టి సినిమా గురించి నిరంతరం ఆలోచించే నిర్మాతలు చాల అరుదుగా ఉంటారని హరీష్ శంకర్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు అలాంటి మంచి నిర్మాతతో స్నేహం పోగొట్టుకోవడం ఎవరికైనా దురదృష్టం అంటూ కామెంట్స్ చేసాడు. దీనితో ఈ కామెంట్స్ హరీష్ శంకర్ పరుశు రామ్ ను దృష్టిలో పెట్టుకుని చేసాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి హరీష్ శంకర్ మాటలలో అర్థాలు ఏమిటో అతడికే తెలియాలి..





మరింత సమాచారం తెలుసుకోండి: