తెలుగు చిత్ర పరిశ్రమ సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ ని ఇంకో స్టేజ్ కి తీసుకెళ్లిన చిత్రం 'నరసింహా'.ఐతే ఆయన అప్పటికే బాషా మూవీ తో పాన్ ఇండియా లెవెల్ లో అన్ని మర్కెట్స్ లోకి అడుగుపెట్టిన రజినీకాంత్ కి 'నరసింహా' చిత్రం ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది.తమిళం లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ఈ మూవీ తెలుగులో కూడా భారీ విజయం సాధించి రజినీకాంత్ కి తెలుగు స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ ని క్రియేట్ చేసింది.ఐతే ఈ చిత్రం లో విలన్ గా నటించిన రమ్య కృష్ణ కి ఎలాంటి స్టార్ క్రేజ్ వచ్చిందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఐతే సౌత్ సినిమాల్లో లేడీ విలన్స్ ట్రెండ్ కి తెరలేపిన హీరోయిన్ రమ్యకృష్ణ మాత్రమే.ఇప్పటికీ ఏ హీరోయిన్ అయినా విలన్ పాత్ర చేస్తే రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రని బేస్ చేసుకుంటారు.దాన్ని కొలమానం గా తీసుకొని పోల్చి చూస్తారు.అలాంటి ప్రభావం చూపించింది ఆ పాత్ర.అలా అటు రజినీకాంత్ ని ఇటు రమ్యకృష్ణ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన ఈ సినిమాని ఒక స్టార్ హీరో మిస్ చేసుకున్నాడట.

మరీ ఆయన ఎవరో కాదు మన నందమూరి బాలకృష్ణ.ప్రముఖ రచయితా చిన్ని కృష్ణ బాలయ్య కోసం రాసుకున్న ఈకథ బీ.గోపాల్ కి ఇచ్చి బాలకృష్ణ తో చేస్తే అదిరిపోతోంది చెప్పాడట.కానీ అప్పటికే బాలయ్య తో 'సమర సింహా రెడ్డి' సినిమా చేస్తున్న గోపాల్, కథ అద్భుతంగా ఉంది హోల్డ్ లో ఉంచు తర్వాత చేద్దాం అన్నాడట.ఈ విషయం చిన్న కృష్ణ స్నేహితుల ద్వారా తమిళ దర్శకుడు KS రవికుమార్ చెవికి చేరింది.వెంటనే చిన్నికృష్ణ వద్దకి వచ్చి,ఈ స్క్రిప్ట్ ని నాకు ఇస్తే నేను రజినీకాంత్ తో చేసుకుంటాను అనగానే , ఎలాగో బాలయ్య వరుసగా సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఈ స్క్రిప్ట్ ని రజినీకాంత్ కి ఇచ్చేద్దామనే నిర్ణయం తీసుకొని KS రవికుమార్ కి ఆ స్క్రిప్ట్ ని అమ్మేసాడట.

ఆ విధంగా తీసిన ఈ మూవీ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసింది.తెలుగు లో మళ్ళీ ఈ మూవీని రీమేక్ చేద్దాం అనుకున్నారు కానీ, ఆ పాత్రకి రజినీకాంత్ తప్ప ఎవ్వరు న్యాయం చెయ్యలేరు అనే రేంజ్ లో ఆయన నటించేసరికి అపుడు ఏ హీరో కూడా ఈ రీమేక్ లో నటించడానికి సాహసం చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: