తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాల తో దూసుకుపోయిన హీరోయిన్ హన్సిక. ఆమె అప్పట్లో చేసిన సినిమా ల్లో అల్లుఅర్జున్ సరసన దేశముదురు సూపర్ హిట్ గా నిల్చింది. అలాగే రామ్ సరసన మస్కా, ఎన్టీఆర్ తో కంత్రి చేసి బిజీ హీరోయిన్ గా మారిపోయింది.ఐతే ఆమె జీవితంలో జరిగిన విఫల ప్రేమ జ్ఞాపకాలు జీవితాంతం బాధించడం తో పాటు ఎన్నో గుణపాఠాల్ని నేర్పిస్తాయని అంటున్నది అగ్ర కథానాయిక హన్సిక. పోయిన డిసెంబర్ ‌లో ఈ భామ సోహైల్‌ కతూరియాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం అందరికి తెలిసిందే. ఐతే తన పెళ్లి ఘట్టాన్ని 'లవ్‌ షాదీ డ్రామా' పేరుతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సిరీస్‌గా విడుదల చేసింది హన్సిక. ఐతే ప్రెసెంట్ తాను వైవాహిక బంధంలో ఆనందంగా ఉన్నానని, గతం తాలూకు చేదు జ్ఞాపకాల్ని పూర్తిగా చెరిపివేసుకున్నానని చెప్పిందీ భామ.

ఐతే కెరీర్‌ స్టార్టింగ్ లోనే లవ్‌ ఫెయిల్యూర్‌ వల్ల కొత్త బంధం లోకి అడుగు పెట్టడానికి దాదాపు ఏడేండ్ల పాటు నిరీక్షించానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ 'ప్రేమ, వివాహ వ్యవస్థ మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఐతే పాత అనుభవాల భయంతో దాదాపు ఏడేళ్ల పాటు ఒంటరిగానే ఉన్నా. అప్పుడు ఇంకా ఎలాంటి రిలేషన్‌లోకి అడుగపెట్టొద్దని నిర్ణయించుకున్నా.

ఐతే అదే సమయంలో సోహైల్‌ పరిచయ మయ్యాడు. అతను చూపించిన ప్రేమ నా జీవితం పట్ల నాకు కొత్త దృక్కోణాన్ని పరిచయం చేసింది. దేవుడే నా మనసుకు సాంత్వన చేకూర్చడానికి అతన్ని పంపించా డేమో అనుకున్నా' అని చెప్పింది.ఐతే తన కెరీర్‌ స్టార్టింగ్ లో తమిళ హీరో శింబుతో కొంతకాలం ప్రేమాయణాన్ని సాగించింది హన్సిక. కొన్ని కారణాల వల్ల అది బ్రేకప్ యింది అటువంటి విఫల ప్రేమ బంధం గురించి హన్సిక పరోక్షంగా చెప్పకనే చెప్తూ కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: