
ముఖ్యంగా టాలీవుడ్ హీరోయిన్ల నుంచి బాలీవుడ్ హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈయనతో ఒక్క సినిమా చేస్తే చాలు అని అనే అంతగా మారిపోయారు అంటే ఆయన క్రేజీ ఏ రేంజ్ లో ఉందో తెలిసిపోతుంది. ఇదిలా ఉండగా ఇటీవల పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పూర్తిస్థాయిలో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ నుంచి ఇప్పుడు ఎలాంటి సినిమా వస్తుందని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే శివానిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్గా ఖుషి సినిమాలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది.
కానీ సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడడంతో సినిమా షూటింగ్ కాస్త ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆమె అనారోగ్య సమస్య నుంచి కోలుకున్నాక షూటింగ్లో పాల్గొంటుంది అంటే మరోవైపు వరుణ్ దావన్ నటిస్తున్న సీటాడేల్ అనే వెబ్ సీరీస్ లో బిజీ కానుంది. దీంతో విజయ్ దేవరకొండ సినిమా ప్రస్తుతం ప్రారంభం అయ్యేటట్టు కనిపించడం లేదు.. ఈ విషయం తెలిసి విజయ్ దేవరకొండ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎప్పుడు మొదలు పెడతారు అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.