పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి  మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు నుండి ఐదు సినిమాల దాకా ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తికాగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ కి సంబంధించిన పనిలో బిజీగా ఉన్నారు చిత్ర బంధం.ఇక ఈ సినిమా జూన్ 16న భారీ స్థాయిలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఏకంగా మరో మూడు సినిమాల షూటింగ్ తో బిజీగా ఉంటాడని తెలుస్తోంది. సలార్ మరియు ప్రాజెక్టు కె సినిమాలతో పాటు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రానున్న రాజా డీలక్స్ సినిమాలో కూడా నటించనున్నాడు ప్రభాస్. 

ఇక ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ ప్రాజెక్టుకి షూటింగ్లను ఒకేసారి చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోని ఈ రెండు సినిమాల కి సంబంధించిన షూటింగ్ గ్యాప్ దొరకగానే మారుతి సినిమాకి కూడా డేట్స్ ఇస్తూ ఉన్నాడట ప్రభాస్. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని తెలుస్తోంది. మాళవిక మోహన్, నిధి అగర్వాల్ రిధి కుమార్ ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. అయితే ప్రభాస్ మాళవిక మోహన్లాల్ కాంబినేషన్లో రావాల్సిన కొన్ని రొమాంటిక్ సీన్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తోంది .

అయితే తాజాగా ఈ సీన్స్ కి సంబంధించిన తదుపరి షెడ్యూల్ షూటింగ్ని మారుతి త్వరలోనే స్టార్ట్ చేయనున్నాడట. అంతేకాదు వీరిద్దరి రొమాన్స్ ఈ సినిమాలో హైలెట్గా నిల్వన ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా ప్రారంభం నుండి ఇంతవరకు ఈ సినిమాకి సంబంధించిన ఒక్క ప్రకటన కూడా ఇంకా చిత్ర బృందం విడుదల చేయలేదు. ఈ సినిమాకి సంబంధించిన మేకర్స్ నుండి కానీ హీరో  హీరోయిన్ల నుండి కానీ ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ కూడా లేదు. అంతేకాదు ఒక్క లుక్ పోస్టర్ కూడా లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే  ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ నైనా విడుదల చేస్తే బాగుంటుందని ఎదురుచూస్తున్నారు ప్రభాస్ అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: