వెన్నెల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కిశోర్ ఆ సినిమాతో అలరించగా అప్పటి నుంచి అతను ఇచ్చిన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ సత్తా చాటుతున్నాడు. టాలీవుడ్ క్రేజీ కమెడియన్స్ లో తాను ఒకడిగా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్నాడు వెన్నెల కిశోర్. హీరో పక్కన పాత్రలతో దాదాపు సినిమా మొత్తం చాలామంది రోల్స్ చేస్తూ వస్తున్నాడు. ఇక అతను చేస్తున్న పాత్రలకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. వెన్నెల కిశోర్ సినిమాలో ఉంటే సినిమా హిట్టే అన్న టాక్ కూడా వచ్చింది.

అయితే వెన్నెల కిశోర్ తన కెరీర్ లో ఒక సాహసం చేస్తున్నాడు. ఇప్పటివరకు తను నెగిటివ్ రోల్ గా చేసింది లేదు కానీ ఒక ప్రెస్టిజియస్ సినిమాలో వెన్నెల కిశోర్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. అదే సినిమానో కాదు శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2 సినిమాలో. ఎన్నో భారీ అంచనాలతో మొదలైన ఇండియన్ 2 సినిమా మధ్యలో ఆగిపోయింది. విక్రం హిట్ అవడంతో ఆ జోష్ లో మళ్లీ ఇండియన్ 2 ని సెట్స్ మీదక్కు తీసుకెళ్లాడు కమల్.

ఈ సినిమాలో మొత్తం ఏడుగురు విలన్లుగా కనిపించనున్నారట. అందులో ఒక విలన్ గా వెన్నెల కిశోర్ కనిపిస్తాడని తెలుస్తుంది. ఇన్నాళ్లు తన కామెడీతో అలరించిన వెన్నెల కిశోర్ తన విలనిజం చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఆల్రెడీ శంకర్ చరణ్ కాంబోలో వస్తున్న ఆర్సీ 15 సినిమాలో కూడా వెన్నెల కిశోర్ నటిస్తున్నాడని తెలిసిందే. సో శంకర్ చేస్తున్న రెండు రెండు సినిమాల్లో వెన్నెల కిశోర్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాలు అతనికి ఏవిధంగా హెల్ప్ అవుతాయో చూడాలి. వెన్నెల కిశోర్ కామెడీకి అలవాటు పడ్డ ఫ్యాన్స్ ఆయన విలనిజం ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: