టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలని వచ్చిన ఈయన అతి తక్కువ సమయంలోనే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి.. ఆ తర్వాత రేడియో జాకీగా కూడా గుర్తింపు తెచ్చుకొని.. సినిమాలలో హీరోగా అడుగు పెట్టాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే తన ప్రతి సినిమాలో కూడా విభిన్నమైన క్యారెక్టర్ ఉండేలాగా జాగ్రత్త పడుతూ నాచురల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన తీరు ఎంతోమంది యువ నటీనటులకు ఆదర్శం.

ఇండస్ట్రీ లోకి రావాలనుకున్న వారు కూడా నానిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వస్తూ ఉంటారు. అలా ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు,  తమిళ్ ప్రేక్షకులకు మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడుగా మారాడు . ఇదిలా ఉండగా ఇటీవల నాని నటించిన చిత్రం అంటే సుందరానికి.. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఎప్పుడు సరికొత్తగా ట్రై చేసే నాని ఈసారి కూడా బ్రాహ్మణ అబ్బాయి అవతారంలో నటించాడు.  అయితే ఈ సినిమా మాత్రం ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించింది కానీ మరొక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.  ఇదే విషయంపై ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వివేక ఆత్రేయ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.

నాని , నజ్రియా నజీమ్ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ్లో కూడా ఒకేసారి రిలీజ్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో వివేక ఆత్రేయ మాట్లాడుతూ..అంటే సుందరానికి సినిమా ఒక వర్గం వారికి నచ్చింది, మరొక వర్గం అసహ్యించుకుంది, నేను అదే సినిమా చేసాను మరియు నేను 2 ఫలితాలు తీసుకోలేను.. నేను ఎవరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి? ఒక్కొక్కరికీ వేరే సినిమా చూపించలేకపోయాను అంటూ తన మనసులోని బాధను కోపం రూపంలో బయట పెట్టుకున్నారు వివేక్ ఆత్రేయ.  మొత్తానికైతే ఆయన చేసిన కామెంట్ లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: