తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి వెంకీ అట్లూరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ దర్శకుడు వరుణ్ తేజ్ హీరో గా రూపొందినటు వంటి తొలి ప్రేమ మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టి మొట్ట మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని ... మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు.

ఆ తరువాత ఈ దర్శకుడు మిస్టర్ మజ్ను ... రంగ్ దే మూవీ లకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు మూవీ లు కూడా ప్రేక్షకులను నిరుత్సాహ పరిచాయి. ఇలా రెండు వరస అపజయాల తర్వాత ఈ దర్శకుడు తాజాగా ధనుష్ హీరో గా రూపొందిన సార్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగు ... తమిళ భాషలలో ఒకే సారి విడుదల అయింది. తమిళ భాషలో ఈ సినిమా వెత్తి అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ  ఇప్పటి వరకు 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 13 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

సార్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లో 17.86 కోట్ల షేర్ ... 33.77 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 6.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఇలా మంచి బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 11.6 కోట్ల లాభాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టి తెలుగు రాష్ట్రాల్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: