సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తమ కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు. నటనలో కూడా ఎవరికి వారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు. అతను మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి జయకృష్ణ కొడుకు అయిన చైతన్య కృష్ణ. బసవతారకం క్రియేషన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను పెట్టిన చైతన్య కృష్ణ ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. 

దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ని మార్చి 5వ తేదీన ప్రకటిస్తామని తాజాగా మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో నందమూరి వంశం నుంచి మరో వారసుడు హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుండడంతో ఫ్యాన్స్ కూడా చైతన్య కృష్ణ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక నందమూరి కుటుంబం నుంచి వారసులుగా మొదట హరికృష్ణ, బాలకృష్ణ సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.. ఆ తర్వాత తరంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినీ రంగ ప్రవేశం చేశారు.

ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి మూడోతరం వారసుడిగా నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయం కాబోతుండటం విశేషం. అయితే తన అన్నయ్య కుమారుడు హీరోగా విజయవంతం కావాలని నందమూరి బాలకృష్ణ సైతం ఆశీర్వదించారు. నిజానికి తారకరత్న మరణాన్ని జీర్ణించుకోక ముందే నందమూరి కుటుంబం నుంచి గుడ్ న్యూస్ రావడం గమనార్హం. మరోవైపు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండే అవకాశం ఉన్నట్లు నందమూరి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుత తరంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతోపాటు నందమూరి బాలకృష్ణ కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: