జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు. ముఖ్యంగా నందమూరి కుటుంబంలో మొదటి నుంచి ఎన్టీఆర్కు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అటు రాజకీయంగా కూడా హరికృష్ణ ఫ్యామిలీ ఒకవైపు నారా ఫ్యామిలీ మరొకవైపు అన్నట్లుగా సాగాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.ఒక దశ వచ్చాక టిడిపిలో హరికృష్ణకు ఎలాంటి ప్రాధాన్యత కూడా ఇచ్చేవారు కాదని తెలుస్తోంది. 2009 ఎన్నికలలో అప్పటి పరిస్థితులలో ఎన్టీఆర్ సహకారం బాబు, బాలయ్య తీసుకున్నారు.అప్పటికే టాప్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ తో టిడిపి పార్టీకి ప్రచారం చేయించడం జరిగింది.


కానీ ఆ ఎన్నికల సమయంలో టిడిపి ఓటమిపాలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ ఎప్పుడు కూడా టిడిపకి   సంబంధించి ఎలాంటి కార్యక్రమాలలో కూడా పాల్గొనలేదు. ఇక 2014లో టిడిపి పార్టీ అధికారం దక్కించుకున్న ఎన్టీఆర్ను మాత్రం దగ్గరకు కూడా రానివ్వలేదు. కానీ 2019లో గోరంగా ఓటమిపాలైంది టిడిపి. ఇక అప్పటినుంచి ఎన్టీఆర్ టిడిపిలోకి రావాలని ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు. కానీ ఈ విషయంపై బాలయ్య ఎప్పుడు స్పందించలేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం బాలయ్య కోసం ఎన్నోసార్లు సినిమా ఈవెంట్లకు పలు కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. కేవలం తనకు తన బాబాయి పట్ల ఉన్న అభిమానాన్ని చూపించడం ఎప్పుడూ కూడా మిస్ అవ్వలేదు.


కానీ బాలకృష్ణ మాత్రం తారకరత్న జరిగిన పెద్దకర్మలో అటు ఎన్టీఆర్ ను ,తారకరత్నను పలకరించకపోవడమే  కాకుండా వారిని చూసి ముఖం చాటేశారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలా ఎన్నోసార్లు కూడా జరిగినట్లు వార్తలు వినిపించడం జరిగింది. దీంతో కొంతమంది ఎన్టీఆర్ అంటే బాలయ్యకు గిట్టదని ప్రచారం కూడా చేయడం జరుగుతోంది .ఇందుకు బలం చేకూర్చే విధంగా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ వర్గం కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య వల్ల నందమూరి అభిమానులకు ఒక తలనొప్పి తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: