టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటి హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో అయితే సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే వరుస హిట్లతో దూసుకుపోతున్న శర్వానంద్ కి ఒకానొక టైం లో వరుస పరాజయాలనేవి పలకరించాయి.ఆ తర్వాత ఇటీవలే ఒకేఒక జీవితం అనే సినిమాతో చాలా మంచి విజయం సాధించాడు. అలాగే ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకున్న శర్వానంద్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు.తాజాగా నేడు శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా శర్వా నెక్స్ట్ సినిమా అప్డేట్ ని ఇవ్వడం జరిగింది.ఇక శర్వానంద్ 35వ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి శర్వాకి బర్త్ డే విషెస్ చెప్పారు. భలేమంచిరోజు, శమంతకమణి, హీరో లాంటి సినిమాలతో జానాలని బాగా మెప్పించిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ 35వ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో హిట్స్ కొడుతూ, మరిన్ని ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. 


ఇక శర్వానంద్ 35వ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా ఎక్కడ షూటింగ్ జరుగుతుందో పోస్టర్ మీద లాటిట్యూడ్, లాంగిట్యూడ్ లని పోస్ట్ చేసి మేకర్స్ తెలిపారు. వాళ్ళు ఇచ్చిన దాని బట్టి లండన్ లో ఈ సినిమా షూట్ జరుగుతున్నట్టు సమాచారం తెలుస్తుంది.ఇక శర్వానంద్ తన పుట్టిన రోజు సందర్బంగా ఇంకా ఈరోజు 20 సంవత్సరాల సినీ ప్రయాణం అని ఎమోషనల్ గా ఒక లెటర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తనకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్తూ మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేస్తానని ఆ పోస్ట్ లో తెలిపాడు. అమ్మ చెప్పింది, యువసేన, గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళి ఇది రానిరోజు, ఎక్సప్రెస్ రాజా, శతమానం భవతి, ఒకే ఒక జీవితం వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకొని ఫ్యామిలీ ఆడియన్స్ లో సెపరేట్ క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో..

మరింత సమాచారం తెలుసుకోండి: