తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటు వంటి విశ్వక్ సీన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వక్ ... తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అలానే ఈ మూవీ ద్వారా నటుడి గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

ఆ తర్వాత విశ్వక్ అనేక మూవీ లలో నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు. విశ్వక్ ఆఖరుగా అశ్విత్ మరిముత్తు దర్శకత్వంలో రూపొందిన ఓరి దేవుడా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో దమ్కీ అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ కి విశ్వక్ దర్శకత్వం కూడా వహించడం మరో విశేషం. నివేదా పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే దమ్కీ మూవీ తో విశ్వక్ హీరో గా మరియు దర్శకుడి గా ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: