ఇప్పుడు ఈవిషయం పై కొందరు టాప్ హీరోల అభిమానులు నానీని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. గత సంవత్సరం విడుదలైన నాని ‘అంటే సుందరానికి’ సినిమాను ప్రమోట్ చేస్తూ నాని పాన్ ఇండియా సినిమాల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. పాన్ ఇండియా సినిమా అన్నది ఉండదని దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు నచ్చిన సినిమా మాత్రమే పాన్ ఇండియా మూవీ అవుతుందని అంటూ పరోక్షంగా పాన్ ఇండియా మూవీ కల్చర్ పై నాని కామెంట్స్ చేసాడు.
ఇప్పుడు ఆకామెంట్స్ ను నానీకి గుర్తుచేస్తూ కొందరు టాప్ హీరోల అభిమానులు నానీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘దసరా’ మూవీ విషయానికి వచ్చే సరికి పాన్ ఇండియా మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్న నాని తన సినిమా ‘దసరా’ దేశవ్యాప్తంగా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాడా అంటూ కొందరు సోషల్ మీడియాలో నానీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
వాస్తవానికి నాని మార్కెట్ కు మించి ‘దసరా’ మూవీ పై భారీ బడ్జెట్ పెట్టారు. ఈమూవీ ట్రైలర్ కు అదేవిధంగా పాటలకు వచ్చిన స్పందనతో ఈమూవీ తనకు 100 కోట్ల సినిమాగా మారుతుందని నానీ భావిస్తున్నాడు. ఈసినిమాకు ఏర్పడిన క్రేజ్ రీత్యా ఒక్క డిజిటల్ డీల్స్ ద్వారా 35 కోట్లకు పైగానే వచ్చాయి అని అంటున్నారు. ఈసినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి కనీసం 60 కోట్లు కలక్ట్ చేస్తే చాలు నాని కలలుకంటున్న 100 కోట్ల టార్గెట్ సులువుగా పూర్తి అవుతుంది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈమూవీ సమ్మర్ రేస్ విజేత అన్న అంచనాలు ఇండస్ట్రీ వర్గాలలో ఉన్నాయి..