టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు ఆయన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ , తేజ దర్శకత్వంలో రూపొందినటు వంటి జయం మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో సదా హీరోయిన్ గా నటించింది. జయం మూవీ తో మంచి విజయాన్ని ... మంచి నటుడు గా గుర్తింపు తెచ్చుకున్న నితిన్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే నితిన్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లు  ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా నితిన్ కెరియర్ లో ఉన్న బ్లాక్ బాస్టర్ మూవీ లలో ఇష్క్ సినిమా ఒకటి. ఈ మూవీ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించగా ... నిత్యా మీనన్ ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. 24 ఫిబ్రవరి 2012 తేదీన విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ కి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది.

ఇది ఇలా ఉంటే అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ మూవీ ని తిరిగి మళ్ళీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయడానికి ఈ మూవీ యూనిట్ సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఈనెల 29 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: