బాలీవుడ్ లో ఎన్నో ఏళ్లుగా ఒక్క హిట్టు కోసం ఎదురుచూసిన షారుక్ ఖాన్ ఎట్టకేలకు 'పఠాన్' మూవీతో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ హైప్  ఏర్పడగా.. అదే రేంజ్ లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డేనే కాకుండా వరుసగా ఐదు రోజులు 100 కోట్లకు తగ్గకుండా పఠాన్ మూవీ కలెక్షన్స్ అందుకుని ఇండియన్ సినీ హిస్టరీలోనే సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. సౌత్ లో ఈ మూవీ పెద్దగా ఆడకపోయినా నార్త్ లో మాత్రం అదరగొట్టింది. ఎంతలా అంటే ఈ సినిమా తాకిడికి పెద్ద పెద్ద సినిమాలు సైతం పోస్ట్ పోన్ అయిపోయాయి. అంతెందుకు ఇటీవల బాహుబలి పేరిట ఉన్న ఐదేళ్ల రికార్డును సైతం పఠాన్ మూవీ బ్రేక్ చేసి హిందీ బెల్ట్ పై హైయెస్ట్ కలెక్షన్స్

 అందుకున్న మూవీ గా నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. ఇక పఠాన్ ఇచ్చిన సక్సెస్ తో షారుక్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న 'జవాన్' పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ భారీ రెస్పాన్స్ ని అందుకుని సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ వీడియో లీక్ అయింది. సుమారు 6 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో షారుక్ ఖాన్ నోట్లో సిగరెట్ పెట్టుకుని ఫైట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా అంతట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ లీక్ అయిన వీడియోలో షారుక్ మరోసారి తన స్వాగ్ తో అదరగొట్టేసాడు.

 మరి ఇది సినిమాలో వీడియోనా? లేదంటే మరేదైనా వీడియోనా? అనేది తెలియనప్పటికీ.. నెట్టింట జవాన్ మూవీ నుంచి లీకైన ఫైట్ సీన్ అంటూ తెగ హల్చల్ చేస్తోంది. కంప్లీట్ హై వోల్టేజ్ యాక్షన్ త్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్ ఖాన్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. సినిమాలో షారుక్ సరసన కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు భారీ స్థాయిలో నాన్ తియేట్రికల్ బిజినెస్ కూడా జరిగింది. సాటిలైట్, డిజిటల్ రైట్స్ కలుపుకొని సుమారు 250 కోట్ల వరకు ఈ సినిమాకు బిజినెస్ జరిగినట్లు సమాచారం. రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో బిజినెస్ జరుపుకున్న జవాన్ రేపు విడుదల తర్వాత ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: