ఇండియా నుండి అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్నత ఉద్యోగాలు చేస్తూ బాగా సెటిల్ అయినవారు ఏదైనా ఒక సమావేశంలో మాట్లాడినప్పుడు వారు మాట్లాడే ఇంగ్లీష్ లో ఎక్కడో అక్కడ మన భారతీయ మూలాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మనదేశంలో చాలామంది మాట్లాడేది బ్రిటీష్ ఇంగ్లీష్. అయితే అమెరికాలో బాగా చదువుకున్న వారు కూడ బాగా మాట్లాడేది అక్కడి అమెరికన్ ఇంగ్లీష్.

అమెరికా వెళ్ళి అక్కడ బాగా చదువుకున్న మన తెలుగువారు అమెరికన్ ఇంగ్లీష్ బాగానే రాస్తారు కానీ మాట్లాడేడప్పుడు ఎక్కడో అక్కడ చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా ఆస్కార్ అవార్డు ఫంక్షన్ కోసం వచ్చిన రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ లు అక్కడి అమెరికా మీడియాకు ఇస్తున్న అనేక ఇంటర్వ్యూలలో అచ్చు రియల్ అమెరికన్స్ మాట్లాడే ఇంగ్లీష్ భాషలో చిన్న పొల్లు కూడ తేడా లేకుండా మాట్లాడటం చూసి అమెరికన్ మీడియాతో పాటు అక్కడి మన ఎన్ఆర్ఐ లు తెగ ఆశ్చర్యపడుతూ సంబరపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  


కొంతమంది ఎన్ఆర్ఐ లు అయితే తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తూ సోషల్ మీడియాలో బహిరంగ ఉత్తరాలు కూడ వ్రాస్తున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ చరణ్ రాజమౌళిలు ఎవరూ ఉన్నత విద్యావంతులు కారు. అయినప్పటికీ ఉన్నత విద్యా వంతులు కూడ మాట్లాడలేని చక్కటి అమెరికన్ ఫ్లోతో ఉండే ఆంగ్ల భాషలో మాట్లాడుతూ అమెరికాలో సందడి చేయడం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.


అంతేకాదు కొందరు ఎన్ఆర్ఐ లు అయితే చరణ్ జూనియర్ రాజమౌళిల తెలివితేటలకు ఆశ్చర్యపడుతూ తమ ప్రశంసలను సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు. ప్రపంచం అనే విశ్వవిద్యాలయంలో అనుభవాల పాఠాలు నేర్చుకున్న ఏవ్యక్తి అయినా మహోన్నత వ్యక్తిగా మారతాడు. దానికి ఉదాహరణ చరణ్ జూనియర్ రాజమౌళి లు అనుకోవాలి. ఇప్పుడే ఇలా ఉంటే అంచనాలకు అనుగుణంగా ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డ్ వస్తే తెలుగు ప్రజల ఆనందానికి హద్దులే ఉండదు..





మరింత సమాచారం తెలుసుకోండి: