మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరు అయినటు వంటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ సినిమాలో అనుష్క తన అదిరిపోయే అంద చందాలను ఆరబోయడం అలాగే తన నటనతో ప్రేక్షకులను కట్టిపాడేయడంతో ఈ మూవీ తో అనుష్క క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అమాంతం పెరిగిపోయింది.

దానితో అనేక తెలుగు సినిమా అవకాశాలను దక్కించుకున్న అనుష్క చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా సమయం లోనే అనుష్క "బాహుబలి" మూవీ ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. అలా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత అదిరిపోయే క్రేజ్ ఉన్న బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది అని చాలా మంది భావించారు.

కానీ అనుష్క ఇప్పటి వరకు ఒక్క బాలీవుడ్ సినిమాలో కూడా నటించలేదు. దానికి కల కారణాన్ని తాజాగా అనుష్క చెప్పుకొచ్చింది. బాహుబలి మూవీ తర్వాత అనేక బాలీవుడ్ సినిమాల నుండి ఆఫర్ లు వచ్చాయి కానీ ... అవి తాను ఆశించిన రేంజ్ ఆఫర్ లు కాదు అని ... అందుకే బాలీవుడ్ సినిమాల్లో నటించ లేదు అని అనుష్క తాజాగా చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుష్క ... నవీన్ శెట్టి హీరో గా రూపొందుతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: