ఈ మధ్య కాలంలో మలయాళ సినిమా ఇండస్ట్రీ నుండి అదిరిపోయే రేంజ్ సినిమాలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మలయాళ సినిమాలు ప్రస్తుతం ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మలయాళ సినిమా ఇండస్ట్రీ నుండి ఇరట్ట అనే సినిమా నెట్‌ ఫ్లిక్స్‌ "ఓ టి టి" లో డిజిటల్ రంగ ప్రవేశం చేసింది. జోజు జార్జ్ మరియు అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కి ప్రస్తుతం ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభిస్తున్నాయి.
irrat
ఇది ఇలా ఉంటే ఇప్పటికే నెట్‌ ఫ్లిక్స్‌ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మలయాళ వర్షన్ కు సూపర్ క్రేజ్ లభిస్తున్న నేపథ్యంలో ఈ మూవీ ని మలయాళం తో పాటు తాజాగా తెలుగు , కన్నడ , తమిళ్ భాషలలో కూడా విడుదల చేశారు. ఈ మూవీ ని ఈ మూడు భాషలలో  నెట్‌ ఫ్లిక్స్‌ "ఓ టి టి"  ప్లాట్ ఫామ్ వారు డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ మలయాళ వర్షన్ కు సూపర్ క్రేజ్ రావడంతో కొంత మంది ప్రేక్షకులు ఈ సినిమా ఇతర భాషల వర్షన్ లు కూడా ఎప్పుడు విడుదల అవుతయా అని చాలా ఆత్రుతగా ఎదురు చూశారు.

ఇలా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా తెలుగు , కన్నడ , తమిళ్ వర్షన్ లను కూడా నెట్‌ ఫ్లిక్స్‌ "ఓ టి టి" వారు విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ సినిమాను చూడడానికి ఎంతో మంది  సినీ ప్రేమికులు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ మూవీ తెలుగు , కన్నడ , తమిళ్  వెర్షన్ లు సినీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాయో చూడాలి. రోహిత్ ఎంజి కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో  శ్రీంద, ఆర్య సలీం, శ్రీకాంత్ మురళి, సాబుమోన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు  జేక్స్ బిజోయ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: