వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్న అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారీ అంచనాలు నడుమ విడుదల అయిన అఖిల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయినప్పటికీ డాన్స్ తో ... నటనతో అఖిల్ మాత్రం ప్రేక్షకులను బాగానే అలరించాడు. ఇది ఇలా ఉంటే అఖిల్ ఆ తర్వాత హలో ... మిస్టర్ మజ్ను మూవీ లలో హీరోగా నటించాడు. ఈ మూవీలతో అఖిల్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం లభించ లేదు.

కొంత కాలం క్రితమే అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" మూవీ లో హీరో గా నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ సక్సెస్ తో జోష్ లో ఉన్న అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో సాక్షా వైద్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఒక పాటను విడుదల చేయగా ఆ పాటకు మంచి రెస్పాన్స్ జనాలు నుండి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ సాంగ్ విడుదలకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క రెండవ పాటను ఈ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ... ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే విడుదల కాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: