తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది దర్శకులు మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి మూవీతో మంచి విజయాలను అందుకొని ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నారు . అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా ఇటు ప్రేక్షకుల నుండి ... అటు విమర్శకుల నుండి అద్భుతమైన దర్శకుడుగా పేరు తెచ్చు కున్న వారిలో సుజిత్ ఒకరు 

ఈ యంగ్ డైరెక్టర్ శర్వానంద్ హీరో గా రూపొందిన రన్ రాజా రన్ మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను ప్రారంభించి అదిరిపోయే రేంజ్ విజయాన్ని ... అద్భుతమైన ప్రశంస లను అందుకున్నాడు. ఆ తర్వాత ఈ దర్శకుడు ఏకంగా ప్రభాస్ లాంటి స్టార్ హీరో మూవీ కి దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అందులో భాగంగా ప్రభాస్ తో సాహో మూవీ ని తెరకెక్కించి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు .

ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని పవన్ కళ్యాణ్ తో చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ తో సుజిత్ "ఓ జి" అనే మూవీ ని రూపొం దించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా గ్యాంగ్ స్టార్ నేపథ్యం లో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది . అలాగే ఈ మూవీ లో అదిరిపోయే ట్విస్ట్ ఉండబోతున్నట్లు ... ఈ ట్విస్ట్ సినిమా చివర లో రానున్నట్లు ... ఈ టెస్ట్ ఎవరు ఊహించే విధంగా ఉండ నున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: