టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో నాని ఒకరు. నాని ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా చాలా వైవిధ్యమైన మూవీ లలో కూడా నటించి మంచి నటుడి గా కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించిన నాని ఆ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే నాని తాజాగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా అనే ఊర మాస్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ... కీర్తి సురేష్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ  ,కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను లక్నో నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసింది.

మూవీ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 7.37 మిలియన్ వ్యూస్ ను ... 279.1 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే దసరా మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను తాజాగా ఈ మూవీ యూనిట్ పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ 2 గంటల 29 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: